కుట్ర ఉన్నట్లుగా అనిపిస్తోంది: ఆకివీడు ఘటనపై పవన్ కల్యాణ్ స్పందన

by Gantepaka Srikanth |

హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే శ్రీరామ నవమి రోజున, ఆకివీడులో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్లిన శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజుపై, ఆయన అనుచరులపై, జనసేన నాయకులపై కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కుట్ర ఉన్నట్లుగా అనిపిస్తోంది: ఆకివీడు ఘటనపై పవన్ కల్యాణ్ స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే శ్రీరామ నవమి రోజున, ఆకివీడులో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్లిన శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజుపై, ఆయన అనుచరులపై, జనసేన నాయకులపై కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘పండుగ రోజు, ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, దాడి వెనుక ఎవరున్నారో విచారణ జరిపి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలి అని పోలీస్ శాఖకు సూచిస్తున్నాను. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అసలు ఏమైందంటే..?

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రామాలయం వద్ద తనపై హత్యాయత్నం జరిగిందని, ఘటన కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఆకివీడు రామాలయాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తోందని, ఆ విషయంలో ఎప్పటి నుంచో వివాదం ఉందని తెలిపారు. అయితే వారంతా హిందువులేనని, కానీ వేరే మతం పేరుతో కొనసాగుతున్నారని చెప్పారు. అందువల్లే అక్కడ రామాలయాన్ని వద్దని, కనీసం శుభ్రం చేసినా వాళ్లు ఒప్పుకోవడం లేదని తెలిపారు.

Next Story