నాకు పునర్జన్మ ఇచ్చారు.. జీవితాంతం రుణపడి ఉంటా: పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |

నాకు పునర్జన్మ ఇచ్చారు.. జీవితాంతం రుణపడి ఉంటా: పవన్ కల్యాణ్

నాకు పునర్జన్మ ఇచ్చారు.. జీవితాంతం రుణపడి ఉంటా: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: నాకు పునర్జన్మను ప్రసాదించి, అడుగడుగునా ధైర్యం, బలం అందిస్తూ నన్ను నడిపిస్తున్న నా ఇష్టదైవం కొండగట్టు అంజన్న స్వామి(Kondagattu Hanuman Temple) వారి సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం కల్పించినందుకు స్వామివారికి మనస్పూర్తిగా ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. కొండగట్టు దేవాలయ అభివృద్ధి కోసం ప్రతిపాదన చేయగానే ముందుకు వచ్చి నిధులు మంజూరు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అలాగే తిరుమల శ్రీవారి భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిధుల ద్వారా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యాలు కలగాలని, స్వామివారి కృపతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాగా, కొండగట్టు అంజన్న ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రూ. 35.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. భక్తుల సౌకర్యార్థం వంద గదుల ధర్మశాల, దీక్షామండపం నిర్మించనున్నారు.

Next Story