అవనిగడ్డ వీణాదేవీ కాలేజీలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ

by GSrikanth |

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిర్వహించే నాలుగో విడత వారాహి యాత్రకు ఆ పార్టీ నాయకులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుంది.

అవనిగడ్డ వీణాదేవీ కాలేజీలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిర్వహించే నాలుగో విడత వారాహి యాత్రకు ఆ పార్టీ నాయకులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుంది. 4వ దశ యాత్ర 5 రోజుల పాటు కొనసాగుతుంది. సభ అనంతరం పవన్‌ మచిలీపట్నం చేరుకుని 2,3 తేదీల్లో అక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2న కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశమవుతారు. 3న జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ఆర్జీలను స్వీకరిస్తారు. 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారు.

Next Story