- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీరప్పన్‌ను పట్టుకున్న ఫారెస్ట్ అధికారిని గుర్తుచేసిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా, అటవీ సంపదను మరియు వన్యప్రాణులను రక్షించే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) నివాళులు అర్పిస్తుంచారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా, అటవీ సంపదను మరియు వన్యప్రాణులను రక్షించే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) నివాళులు అర్పిస్తుంచారు. ఈ సందర్భంగా, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను పట్టుకునే ఆపరేషన్‌లో కీలకపాత్ర పోషించి, తన ప్రాణాలను అర్పించిన అటవీశాఖ ఉన్నతాధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్(IFS) త్యాగం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రతీ అమర వీరుని వెనుక ఒక కుటుంబం ఉంటుంది. వారు తమ ఆత్మీయుడిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, సమాజం కోసం వారు చూపిన త్యాగం మరువలేనిది. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాల పక్షాన నిలిచి, వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. అడవులను రక్షించేందుకు కృషి చేస్తున్న ప్రతి అటవీ సిబ్బందికి అండగా నిలిచి, వారికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ‘సంజీవని’ ద్వారా అవసరమైన చర్యలు చేపట్టనుందని కీలక ప్రకటన చేశారు.






