- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DCM:‘ఆర్థిక ఇబ్బందులున్నా. హామీలు అమలు చేస్తున్నాం’.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హాజరైన విషయం తెలిసిందే

దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం ఎన్డీయే బలమే కాదు.. ప్రధాని మోడీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే ద్వారా దేశాన్ని బలోపేతం చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. ఢిల్లీ విజయం 27 ఏళ్ల తర్వాత సాధించిన చారిత్రాత్మకం. ప్రధాని మోడీకి, ఢిల్లీ సీఎంకు ఆల్ ది బెస్ట్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh)లో గత ప్రభుత్వ పాలన పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో సమన్వయంతోనే కలిసి ముందుకెళ్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల వెన్నునొప్పితో ఏపీలో కొన్ని భేటీలకు హాజరుకాలేకపోయానని అన్నారు. ఇప్పటికే వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమైన శాఖలు అని తెలిపారు. తనకిచ్చిన శాఖలను నిబద్ధతతో నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తుందన్నారు. వైఎస్ జగన్.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని, ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.






