‘వజ్ర’ బృందాలను సిద్ధం చేస్తున్నాం.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్‌ను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ‘హనుమాన్ ప్రాజెక్ట్’ తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

‘వజ్ర’ బృందాలను సిద్ధం చేస్తున్నాం.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ‘హనుమాన్ ప్రాజెక్ట్’ తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం పూర్తి సాంకేతికతతో కూడిన 100 వాహనాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలు కాగా, మరో 7 వాహనాలు వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అవసరమైన అంబులెన్స్‌లు ఉన్నాయని స్పష్టం చేశారు. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లుటిల్లో నాలుగు వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లు, 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్ (గిరిజన), పారా వెటరేనియన్స్ తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుందని తెలిపారు. గ్రామస్థాయిలో వన్య జీవి రక్షక్ (వజ్ర)లను అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తున్నాం. గ్రామ స్థాయిలో పాములు, ఇతర జంతువుల నుంచి ఎదురయ్యే సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇచ్చాం’ అని హనుమాన్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Next Story