Guntur: ‘స్వచ్ఛ ఏపీ-స్వచ్ఛ దివస్‌’పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2025-01-18 08:08:17.0  )
Guntur: ‘స్వచ్ఛ ఏపీ-స్వచ్ఛ దివస్‌’పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా నంబూరు(Nambur)లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) పర్యటించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్-స్వచ్ఛ దివస్(Swachh Andhra Pradesh-Swachh Divas) కార్యక్రమంలో భాగంగా ఆయన పారిశుధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పరిశుభ్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్ణాంధ్ర-2047(Swarnandhra-2047)లో పరిశుభ్రత ఎంతో కీలకమని చెప్పారు. భవిషత్ తరాలకు ఈ కార్యక్రమం ప్రేరణ కావాలని సూచించారు. అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే పరిశుభ్రత ముఖ్యమన్నారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఏపీ నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించిందని గుర్తు చేశారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. కరోనా వంటి పరిస్థితుల్లో శుభ్రత ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందనన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తే స్వర్ణాంధ్ర-2047 లక్ష్యం నెరవేరుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story