- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు అంత అనుభవం లేదు.. దానికి చంద్రబాబు అయితేనే కరెక్ట్: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర అభివృద్ధి మరియు పారిశ్రామిక ప్రగతిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అభివృద్ధి మరియు పారిశ్రామిక ప్రగతిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్సిలర్ మిట్టల్ - నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పెట్టుబడులను ఆకర్షించడంలో అనుభవం మరియు దార్శనికత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రాష్ట్రం బలంగా ఉండాలన్నా, భారీ స్థాయిలో పెట్టుబడులు రావాలన్నా దార్శనికత (Vision) ఉన్న నాయకుడు అవసరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాష్ట్రానికి తీసుకురావడం సామాన్యమైన విషయం కాదని, దానికి రాజకీయ దురంధరత్వం ఉండాలని అభిప్రాయపడ్డారు. "నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావొచ్చు కానీ, నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకువచ్చే అనుభవం ఉన్న నాయకుడు మనకు కావాలి" అంటూ పవన్ కల్యాణ్ తన వినమ్రతను చాటుకున్నారు.
కూటమి విజయవంతం..
గతంలో తాను కోరుకున్న కూటమి వల్లే ఈరోజు ఉత్తరాంధ్రలో లక్ష మందికి పైగా ఉపాధి కల్పించేలా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విలక్షణమైన రాజకీయ నాయకత్వం ఉంటేనే పారిశ్రామికవేత్తలు నమ్మకంతో ముందుకు వస్తారని స్పష్టం చేశారు. నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంత ముఖచిత్రం మారబోతోందని, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.






