- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM:‘ఇవాళ్టి నుంచి వారిని అలా పిలవద్దు’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మే డే సందర్భంగా కార్మికులు, శ్రామికులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మే డే సందర్భంగా కార్మికులు, శ్రామికులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజు(గురువారం) మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఉపాధి హామీ కార్మికులతో మాట్లాడారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రక్తం ధారపోసి పనిచేసేవారు లేకపోతే ఏ నిర్మాణం జరగదు. మిగతా వృత్తుల్లో ఉన్న వారిలాగే శ్రామికులు కూడా గొప్పవారే అని తెలిపారు. ఇవాళ్టి నుంచి ఉపాధి హామీ కూలీలు కాదు.. ఉపాధి శ్రామికులు అని పిలవాలని చెప్పారు. దేశాభివృద్ధికి కృషి చేసే వాళ్లు శ్రామికులవుతారు.. కానీ కూలీలు కాదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. వారే లేకపోతే రాష్ట్ర నిర్మాణం, దేశ నిర్మాణం ఉండదని తెలిపారు. శ్రామికుల కష్టాన్ని, వారి నైపుణ్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిని కాబట్టే వారిని కూలీలు అని పిలవకూడదు అని చెబుతున్నానని అన్నారు. గతేడాది 24.23 కోట్ల పని దినాలు, 5.10 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ ఉపాధి హామీ పథకం కింద రూ.10,669 కోట్లు ఖర్చు చేశాం అని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు.






