AP Deputy CM:‘ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలి’.. పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-05 08:21:29  IST  )

తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంకకు చెందిన సముద్రపు దొంగలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

AP Deputy CM:‘ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలి’.. పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి
X

దిశ,వెబ్‌డెస్క్: తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంకకు చెందిన సముద్రపు దొంగలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లపై పైరెట్స్ దాడి చేసిన ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం కోరమాండల్‌ కోస్తా సమీపంలో సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన తమిళనాడు(Tamilnadu) నాగపట్టినం జిల్లాకు చెందిన 30 మందికి పైగా జాలర్లపై శ్రీలంక(Sri Lanka) సముద్రపు దొంగలు దాడి చేశారు.

అంతటితో ఆగకుండా చేపల వలలు లూటీ చేసి.. పడవలపై దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు రూ.10 లక్షల వస్తువులను దోచుకున్నట్లు సమాచారం. ఈ దాడి ఘటనపై ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తాజాగా స్పందించారు. ఈ క్రమంలో చేపల వేటకు వెళ్లిన 30 మంది తమిళనాడు జాలర్లపై శ్రీలంకకు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడడం పై పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చాలా బాధాకరమని తెలిపారు.

శ్రీలంకతో భారత్‌కు ఉన్న మంచి సంబంధాల దృష్ట్యా విదేశీ వ్యవహారాల శాఖ(Department of Foreign Affairs) ఆ దేశంతో చర్చించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో భారత్, శ్రీలంక నిర్మాణాత్మక శైలీలో చర్చలు జరపాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాలర్ల భద్రత పై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన 17 మంది జాలర్లను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story