రోహింగ్యాలకు ఓటర్, రేషన్ కార్డులు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రోహింగ్యాల(Rohingyas) వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు.

రోహింగ్యాలకు ఓటర్, రేషన్ కార్డులు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రోహింగ్యాల(Rohingyas) వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోహింగ్యాల వలసలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యాలు వలసదారులు వచ్చారు. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో కోల్ కత నుంచి స్వర్ణకార వృత్తి నిమిత్తం చాలా అధికంగా వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చారు. రోహింగ్యాల మూలాలు మయన్మార్‌లో ఉన్నాయి. వారి వలసలతో స్థానిక యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండు. తెలంగాణ ఏర్పాటులో ఉన్న మూడు ప్రధాన డిమాండ్లలో స్థానికులకే ఉద్యోగాలు అనేది కూడా ప్రధాన నినాదం.

అయితే రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేలా రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారు. మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు. రోహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఉంది. వారికి ఎలా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు వస్తున్నాయి..? ఎవరు ఇస్తున్నారనేది తేలాలి. మన వ్యవస్థలోనే కొందరు వ్యక్తులు వారికి సహకరిస్తున్నారని అర్ధం అవుతుంది. రోహింగ్యాలు ఈ దేశ పౌరులుగా మారి, మన అవకాశాలను ఎలా కొల్లగొడుతున్నారనే దానిపై అందరిలోనూ చైతన్యం రావాలి. రోహింగ్యాలు స్థానికులుగా మారడానికి సహరిస్తున్న యంత్రాంగంపై కన్నేసి ఉంచాలని, అంతర్గత భద్రతలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు బాధ్యత గల ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా స్పందిస్తూ లేఖ రాశానని మీడియాకు తెలిపారు.

Next Story