- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హిమాలయాలకు వెళ్లిపోతావా?’.. ప్రధాని ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానం.. ఏంటంటే?
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) వెళ్లిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోడీ స్టేజీపైనే ముచ్చటించారు. అయితే పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ ఎప్పుడు కలిసిన వారిద్దరి మధ్య ప్రేమ, సరదాగా మాట్లాడుకోవడం చూస్తూనే ఉన్నాం. గతంలో పవన్ కళ్యాణ్‌ను ప్రధాని మోడీ తుఫాన్ తో పోల్చి ప్రశసించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిన అనంతరం పవన్ కళ్యాణ్‌కు మరింత ప్రాదాన్యతనిస్తూ వస్తున్నారు. అంతేకాదు మహారాష్ట్ర ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు సీఎం చంద్రబాబు ప్రచారం చేశారు. సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో దక్షిణాన బీజేపీ సైద్ధాంతిక విస్తరణకు రాజకీయ అవసరాలకు ఆయనను ఆ పార్టీ కీలకంగా భావిస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోడీ తనతో ఏం మాట్లాడారని మీడియా ప్రశ్నించింది. దీనికి పవన్ కళ్యాణ్ నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘ప్రధాని మోడీ నాతో చిన్న జోక్ చేశారు. ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలి అనుకుంటున్నారా? అని అడిగారు. అందుకు ఇంకా చాలా టైమ్ ఉందని చెప్పాను. నువ్వు చేయాల్సిన పని చెయ్యు అని నాతో చెప్పారు’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.






