- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YSRCP:‘పవన్ కళ్యాణ్.. ఇలాంటివి కనిపించడం లేదా?’.. వైసీపీ సంచలన వ్యాఖ్యలు
ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైఎస్సార్సీపీ సోషల్ మీడియా(Social Media) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైఎస్సార్సీపీ సోషల్ మీడియా(Social Media) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. రంపచోడవరంలో బిడ్డల ప్రాణాల కోసం గిరిజనులు పోరాటం ఆవేదనకు గురిచేస్తోందని పేర్కొంది. బిడ్డల ప్రాణాలు కాపాడుకునేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri sitaramaraju disrict)లో గిరిజనులు పోరాటం చేస్తున్నారని వైసీపీ(YSRCP) ఓ వీడియో(Video)ను పోస్ట్ చేసింది.
అడ్డతీగల మండలం పనుకురాతిపాలెంలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను కాపాడేందుకు రోడ్డు, పెద్దేరు వాగుపై వంతెన సౌకర్యం లేక ట్యూబ్ సాయంతో గిరిజనులు దాటుతున్నారని తెలిపింది. వాగుపై వంతెన సౌకర్యం లేకపోవడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గిరిజనులను వాగులో పెద్ద సాహసమే చేస్తున్నారని వైసీపీ పేర్కొంది. ఈ క్రమంలో గిరిజనులను ఉద్ధరిస్తామని కబుర్లు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan)కు ఇవి కనిపించడం లేదా? అని ట్విట్టర్(Twitter) వేదికగా వైసీపీ ప్రశ్నించింది.ట్వీట్






