- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: జీవితం కష్టసుఖాల సమ్మేళనం
తెలుగు ప్రజలకు జనసేన పార్టీ(Janasena Party) అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉగాది పండుగ(Ugadi Festival) శుభాకాంక్షలు చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలకు జనసేన పార్టీ(Janasena Party) అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉగాది పండుగ(Ugadi Festival) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు.. జాతిని సజీవంగా నిలుపుతాయి. మన ముంగిళ్లకు వచ్చిన 'ఉగాది' తెలుగువారి వారసత్వపు పండుగ. విశ్వావసు అనే గంధర్వుడు పేరుతో వచ్చిన ఈ ఉగాది పండుగ తరుణాన తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. జీవితం కష్టసుఖాల సమ్మేళనం. మన ఉగాది పచ్చడిని అందుకు సంకేతంగా భావిస్తాము. గత ప్రభుత్వ పాలన కష్టాలమయమైపోగా – ఇప్పుడు ప్రజలకు సుఖాలను అందించే మంచి పాలన ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ముంగిటకు వచ్చింది. చైత్ర మాసపు శోభతో వసంతాన్ని మోసుకువచ్చిన శ్రీ విశ్వావసు నామ ఉగాది... తెలుగు లోగిళ్ళను సిరిసంపదలతో పచ్చగా ఉంచాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.






