ఆర్ఆర్ఆ‌ర్‌కు ఆస్కార్.. భారతీయులు గర్విస్తున్న క్షణాలివి: పవన్ కల్యాణ్

by Disha Web Desk 2 |
ఆర్ఆర్ఆ‌ర్‌కు ఆస్కార్.. భారతీయులు గర్విస్తున్న క్షణాలివి: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన 'ఆర్ఆర్ఆర్' చిత్ర సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్‌కు హృదయపూర్వక అభినందనలు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నిలిచిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో 'నాటు నాటు' గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఆ హుపారు ఈరోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతో పాటు.. అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది.

ఇంతటి ఘనత పొందేలా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్ఎస్రాజమౌళికి ప్రత్యేక అభినందనలు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన ఎన్టీఆర్, రాంచరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకులు ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యలకు అభినందనలు. 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుంది.’’ అని పవన్ కల్యాణ్ మూవీ యూనిట్‌ను అభినందించారు.


Next Story

Most Viewed