Pawan Kalyan: ‘వాటిని నాకు పరిచయం చేసింది మా నాగబాబు అన్నయ్యే’

by Gantepaka Srikanth |

ప్రముఖ సినీ నటులు, జనసేన పార్టీ(Janasena Party) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు(Nagababu)కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

Pawan Kalyan: ‘వాటిని నాకు పరిచయం చేసింది మా నాగబాబు అన్నయ్యే’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటులు, జనసేన పార్టీ(Janasena Party) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు(Nagababu)కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘సామాజిక అంశాలను సునిశితంగా విశ్లేషించి, ప్రజాపక్షం వహిస్తూ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెబుతారు మా చిన్న అన్నయ్య నాగబాబు గారు. చిన్నన్నయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నెల్లూరులో నాగబాబు(Nagababu) గారు చదువుకునే రోజుల్లో నానీ పాల్కీవాలా రచనల గురించి నాకు చెప్పేవారు. అదే విధంగా సాహిత్యంతో పాటు సామాజిక రాజకీయ అంశాలను తెలిపే పుస్తకాల గురించి పరిచయం చేసింది కూడా మా అన్నయ్య నాగబాబు(Nagababu) గారే. జనసేన పార్టీ(Janasena Party) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా క్రియాశీలకంగా వ్యహరిస్తూ పార్టీ శ్రేణులతో మమేకమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో అన్నీ తానై పనిచేశారు. చిన్నన్నయ్య శ్రీ నాగబాబు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనందాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు.

Next Story