Pawan Kalyan: ఒకే తాటిపై ఉండటం మన బాధ్యత

by Gantepaka Srikanth |

దేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) 79వ స్వాతంత్ర్య దినోత్సవ(Independence Day) శుభాకాంక్షలు తెలియజేశారు.

Pawan Kalyan: ఒకే తాటిపై ఉండటం మన బాధ్యత
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) 79వ స్వాతంత్ర్య దినోత్సవ(Independence Day) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ‘ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వతంత్ర ప్రజాస్వామ్య సౌధం మన దేశం. మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది అంటే ఆ త్యాగధనుల ఆత్మార్పణల ఫలితమే. దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలి. నుదిటి సిందూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించి, వారిని పెంచి పోషిస్తున్న ముష్కరులను అన్ని విధాలుగా కట్టడి చేసే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. రక్షణ, అంతరిక్ష రంగాల్లో అభేద్యమైన స్థాయికి మన భారత దేశం చేరుతున్నందుకు ప్రతి ఒక్కరం గర్విద్దాము. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృఢ నాయకత్వంలో రక్షణపరంగానే కాకుండా ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉంటూ.. అంతర్జాతీయంగా మూడో స్థానానికి చేరువయ్యాము. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగకుండా ఒకే తాటిపై ఉండటం మన బాధ్యత’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story