Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. ఆ కేసు ఏమైంది? : తమ్మారెడ్డి భరద్వాజ్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-18 12:15:16  IST  )

సుగాలి ప్రీతి కేసు(Sugali Preethi Case) ఏమైందని సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్(Tammareddy Bharadwaja) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ప్రశ్నించా(Asked)రు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. ఆ కేసు ఏమైంది? : తమ్మారెడ్డి భరద్వాజ్
X

దిశ, వెబ్ డెస్క్ : సుగాలి ప్రీతి కేసు(Sugali Preethi Case) ఏమైందని సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్(Tammareddy Bharadwaja) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ప్రశ్నించా(Asked)రు. ఈ కేసుకు సంబంధించి తన అభిప్రాయాలను వివరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. 2014-19టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసును తమ ప్రభుత్వం వచ్చాక మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటామని 2019, 2024అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించారని..ఎన్నికల తర్వాతా ఆ కేసును ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.

సుగాలి ప్రీతి కేసులాంటివి ఇక మీదట జరుగనివ్వబోమన్న పవన్ కల్యాణ్ తన హామీ మేరకు తీసుకున్న చర్యలేమిటో వెల్లడించాలన్నారు. వైఎస్. జగన్ పాలనలోనూ ఈ కేసులో పురోగతి సాధించలేదని..దోషులను ఇప్పటివరకు పట్టుకోలేదన్నారు. సీబీఐ ఏమో తమకు స్టాఫ్ లేదంటూ విచారణకు ముందుకురానట్లుగా వార్తలు వెలువడ్డాయన్నారు. ఏపీలో 30 వేల మహిళలు, బాలికలు మిస్సింగ్ అయ్యారని పవన్ కల్యాణ్ చెప్పారని..వారి విషయంలో పవన్ అధికారంలోకి వచ్చాకా ఏం చేశారని తమ్మారెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతపై స్పందించాల్సి ఉందన్నారు.

వైసీపీ హయంలో ప్రకటించిన మెడికల్ కళాశాలలను ఎందుకు కూటమి ప్రభుత్వం చేపట్టడం లేదని..ఏపీలో వైద్య సీట్లు పెరుగాల్సి ఉందన్నారు. మహిళలు, విద్య వంటి అంశాలపై మాట్లాడే పవన్ వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డిప్యూటీ సీఎం పవన్ తను చేసిన హామీ మేరకు మహిళల భద్రతపైన, సుగాలి ప్రీతి కేసుపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని, అది ఆయన ధర్మమని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.


Click For Tweet..

Next Story