కుంకీ ఏనుగుల ప్రత్యేకత ఇదే.. పవన్ కల్యాణ్ ట్వీట్

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య సహకారం చారిత్రాత్మక మైలురాయి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు.

కుంకీ ఏనుగుల ప్రత్యేకత ఇదే.. పవన్ కల్యాణ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య సహకారం చారిత్రాత్మక మైలురాయి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రతిష్టాత్మక విధాన సౌధలో ఆంధ్రప్రదేశ్‌కు కుంకి ఏనుగులను(Kunki Elephants) అప్పగించడంలో కర్ణాటక ప్రభుత్వం చూపిన సహకారానికి కృతజ్ఞతలు చెప్పారు. ఇది కేవలం పరిపాలనా పరమైన లాంఛనమే కాదు.. సహకార సమాఖ్యవాదానికి నిదర్శనమన్నారు. ఈ శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌లో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ ఫలితంగా అడవి ఏనుగుల దాడుల వల్ల కలిగే ప్రాణనష్టాన్ని, పంట నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. మరో ప్రత్యేకత ఏమిటంటే దీని స్ఫూర్తి.. మన రాష్ట్రం ఈ ప్రతిపాదనపై కర్ణాటక ప్రభుత్వం సత్వర ప్రతిస్పందన, రాజకీయాలకు అతీతంగా ఉండడమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు, ఫారెస్ట్ మినిస్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఈ బలమైన స్నేహం మరియు సహకారం రాబోయే సంవత్సరాల్లో కూడా వృద్ధి చెందుతుందని నేను గట్టిగా నమ్ముతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story