‘సోదరుడు లోకేష్‌కు థాంక్స్’.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-22 14:59:16  IST  )

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు

‘సోదరుడు లోకేష్‌కు థాంక్స్’.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు అని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. కుంకీ ఏనుగులను తీసుకురావడంపై తనకు అభినందనలు తెలిపిన మంత్రి నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థాంక్స్ చెప్పారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. సోదరుడు నారా లోకేష్‌కు ధన్యవాదాలు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఈ సమస్యకు ముగింపు పలకాలని ఉద్దేశంతోనే కుంకీ ఏనుగులను తీసుకొచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడంతో పాటు.. ఏనుగుల దాడులకు ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నాను అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story