- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ బలోపేతంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దృష్టి సారించారు. ఇందులో భాగంగానే శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఒక్కొక్క ఎమ్మె్ల్యేతో విడివిడిగా మాట్లాడుతున్నారు. ఇప్పటివరకూ వారి వారి నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వివరాలు, నియోజక వర్గంలో ఉన్న సమస్యలతోపాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చిస్తున్నారు. ఇవాళ తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. రేపు శనివారం నాడు మిగిలిన ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చిస్తారు. ఇప్పటివరకు మండలి బుద్ధ ప్రసాద్, లోకం నాగ మాధవిలతో వన్ టూ వన్ సమావేశం ముగిసింది. కాగా, ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సమర్థవంతమైన పాలనకు ఉదాహరణగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, ప్రజా జీవితంలో ఆయన ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని, అనుభవం, బాధ్యత ద్వారా పాలన నేర్చుకున్నారని ఆయన అన్నారు. రాజకీయాల్లో స్ట్రగుల్ అవుతున్నాడు.. అందులోంచి పాఠాలు నేర్చుకుని సక్సెస్ కూడా అవుతున్నాడని ప్రశంసించారు.






