భార్యతో కలిసి తొలిసారి మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే..? (వీడియో)

by Sathputhe Rajesh |   (  Updated:2024-05-14 14:09:42  IST  )

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గత కొన్ని నెలలుగా ఎలక్షన్ క్యాంపెయిన్‌లో బిజీగా గడిపారు.

భార్యతో కలిసి తొలిసారి మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గత కొన్ని నెలలుగా ఎలక్షన్ క్యాంపెయిన్‌లో బిజీగా గడిపారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆయన ప్రధాని మోడీ నామినేషన్ సందర్భంగా వారణాసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తొలిసారి భార్య అన్నా లెజినోవాతో కలిసి నేషనల్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ నామినేషన్‌కు రావడం గౌరవంగా భావిస్తున్నా అన్నారు. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జనసేన చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. బలమైన మెజార్టీ సాధించబోతున్నామని నొక్కి చెప్పారు. మోడీ మూడోసారి దేశ ప్రధాని కాబోతున్నారని చెప్పారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ మాట్లాడిన వీడియోను జనసేన పార్టీ ట్వీట్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story