Vijayasai Reddy : ఏపీకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలి : విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-06 09:39:44  IST  )

ఏపీ(AP)కి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నాయకత్వం(lead)వహించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు(sensational comments)చేశారు

Vijayasai Reddy : ఏపీకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలి : విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)కి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నాయకత్వం(lead)వహించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు(sensational comments)చేశారు. నేషనల్ పాపులారిటీ, వయస్సు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉందని ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విజయసాయిరెడ్డి పేర్కోన్నారు. యువ రాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేడంటూ పరోక్షంగా సీఎం చంద్రబాబును ఉద్ధేశించి విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.

పవన్ కళ్యాణ్ ను సీఎం పదవికి తగిన వ్యక్తిగా అభివర్ణిస్తూ విజయసాయిరెడ్డి చేసిన సంచలన ట్వీట్ వైరల్ గా మారింది. నిన్న కాకినాడ పోర్టు వ్యవహారంలో ప్రభుత్వం తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించే క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చిన సాయిరెడ్డి.. చంద్రబాబు, లోకేష్ కంటే పవనే బెటర్ లీడర్ అని వ్యాఖ్యానించారు. దీనిపై చర్చ కొనసాగుతుండగానే ఇవాళ ఎక్స్ లో ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలంటూ మరో సంచలన పోస్టు పెట్టి కూటమి పార్టీల్లో కాక రేపారు. సాయిరెడ్డి వ్యాఖ్యలపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story