- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులం గురించి మాట్లాడింది చాలు.. నేను చిట్టా విప్పితే.. పవన్ కల్యాణ్ ఫైర్
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానితో దేశభవిష్యత్ గురించే మాట్లాడతానని అన్నారు. వాళ్లను వీళ్లను అరెస్ట్ చేయమని ఎందుకు అడుగుతానని మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానితో దేశభవిష్యత్ గురించే మాట్లాడతానని అన్నారు. వాళ్లను వీళ్లను అరెస్ట్ చేయమని ఎందుకు అడుగుతానని మండిపడ్డారు. పది మంది ఉగ్రవాదులు దేశాన్ని వణికిస్తుంటే 20వేల మంది ఉన్న మీరు ఎంతమంది గుండాలను అరికట్టగలరని వ్యాఖ్యానించారు. కులం గురించి ఇక మాట్లాడింది చాలని తాను చిట్టా విప్పితే ఎవరూ తట్టుకోలేరని హెచ్చరించారు. సగటు జీవి ఆవేదనను జనసేన అర్థం చేసుకుంటుందని అన్నారు. అందరూ వదిలేసింది పట్టుకోవడమే జనసేన ప్రత్యేకత అని చెప్పారు. కార్యకర్తలు కూడా జనసేన భావజాలాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
క్రమశిక్షణ కలిగిన ఫోర్స్ జనసేనకు కావాలన్నారు. మనదగ్గర 20వేల మంది సాధక్ లు ఉన్నారని అన్నారు. తనకు రాజకీయాలు అవసరంలేదని సామాజికమార్పు కావాలని వ్యాఖ్యానించారు. ఉద్యమకారుడి నుండి తాను సాధకుడిగా మారానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే ఆ క్షణం నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈరోజు కోట్ల నిధులకు నాందిపలికిందని అన్నారు. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చాలా మంది తనను హింసించారని మీరు గట్టిగా నిలబడితే ఎదుటివాడు భయపడిపోవాలని కార్యకర్తలకు సూచించారు. వేల కోట్లు తనకు అవసరంలేదని కార్యకర్తలే తన ఆస్తి అని చెప్పారు.






