అలాంటి వాళ్లు నా పార్టీలో అవసరంలేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

క్రిమినల్ ఆటిట్యూడ్‌తో ఉండే నాయకులు తనకు అవసరం లేదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ ఆటిట్యూడ్ తో ఎవరు వచ్చినా వాళ్లు జనసేనలో ఉన్నా,కూటమి పార్టీలో ఉన్నా తాను ఉపేక్షించను అని స్పష్టం చేశారు. అలాంటి వారిని వుదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కానీ జనాలను వదులుకునేందుకు సిద్ధంగా లేనని అన్నారు.

అలాంటి వాళ్లు నా పార్టీలో అవసరంలేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: క్రిమినల్ ఆటిట్యూడ్‌తో ఉండే నాయకులు తనకు అవసరం లేదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ ఆటిట్యూడ్ తో ఎవరు వచ్చినా వాళ్లు జనసేనలో ఉన్నా,కూటమి పార్టీలో ఉన్నా తాను ఉపేక్షించను అని స్పష్టం చేశారు. అలాంటి వారిని వుదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కానీ జనాలను వదులుకునేందుకు సిద్ధంగా లేనని అన్నారు. అంతే కాకుండా 2029లో వైసీపీ అధికారంలోకి రావ‌డం జ‌ర‌గ‌ద‌ని జోస్యం చెప్పారు. సోష‌ల్ మీడియాలో వైసీపీ కామెంట్లు గ‌మ‌ణిస్తున్నాన‌ని మార్పు రాక‌పోతే త‌న‌లో గ‌ట్టిద‌నం ఏంటో చూస్తార‌ని చెప్పారు. ఐదేళ్లు అధికారం ఇస్తేనే రాష్ట్రాన్ని నాశ‌నం చేశార‌ని అందుకే ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టార‌న్నారు.

ప‌క్క‌న పెట్టినా వైసీపీ నాయ‌కుల మాట‌ల్లో మార్పు రావ‌డంలేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఒక ప‌ద్ధ‌తిగా విమ‌ర్శిస్తే త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుంటామ‌ని చెప్పారు. కానీ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తే ఊరుకోమ‌ని అన్నారు. త‌ప్పుల‌ను రిపీట్ చేసేవారిని తాను క్ష‌మించ‌న‌ని చెప్పారు. అంద‌రినీ గ‌మ‌ణిస్తున్నామ‌ని ఎవ‌రేం మాట్లాడుతున్నారో చూస్తున్నామ‌ని అన్నారు. రాజోలు గ‌డ్డ సాక్షిగా వైసీపీ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం అనేది జ‌ర‌గ‌దు అంటూ దీమా వ్య‌క్తం చేశారు. కొబ్బ‌రి చెట్టును ఎలా పెద్ద‌కొడుకు అనుకుంటారో కూట‌మిని కూడా అలాగే పెద్ద‌కుమారుడు అనుకుని ప్ర‌జ‌లు దీవించాల‌ని కోరారు. 15ఏళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు.

Next Story