- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెంచు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం : డిప్యూటీ CM పవన్
చెంచు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: చెంచు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మంగళవారం కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పలు అంశాలను కేంద్రమంత్రికి విన్నవించానని ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అరణ్య భవన్లో ఆధునిక అటవీ పరిశోధన, శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు అంగీకరించారని తెలిపారు. అలాగే హనుమాన్ - యానిమల్ కాన్ ఫ్లిట్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించానని పవన్ వివరించారు. గ్రేట్ గ్రీన్ వాల్ మానిటరింగ్ సెంటర్ కు కేంద్రం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చినట్లు పవన్ తెలిపారు. అలాగే రాష్ట్ర్లంలో పులులు సంక్షణ కోసం బేస్ క్యాంపులను 90 నుంచి 150కి పెంచాలని భూపేంద్ర వద్ద ప్రతిపాదించామని, దానిపై కూడా సానుకూలంగానే స్పందించారన్నారు. దీనిద్వారా 300 మంది చెంచు యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తామన్నారు. టైగర్ మానిటరింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అడవిలో గస్తీ కాచే సిబ్బందికి బైకులు, డ్రై రేషన్, ఇతర సౌకర్యాలను కల్పించే అంశంపై కూడా మంత్రితో చర్చించినట్లు పవన్ తెలిపారు. ఇక మధ్యప్రదేశ్ నుంచి 50 భారతీయ అడవిదున్నలను పంపేందుకు ఆ రాష్ట్రం ఒప్పుకున్నారని, సెప్టెంబర్ - అక్టోబర్ నెలల్లో వాటిని తరలించే చాన్స్ ఉంటుందని తెలిపారు. పులుల జన్యువైవిధ్యం కోసం మహారాష్ట్ర నుంచి 4, మధ్యప్రదేశ్ నుంచి రెండు ఆడపులులను పంపాలని ప్రతిపాదించామన్నారు. గోదావరి నది కాలుష్యంపై రాష్ట్రానికి సీపీబీసీ టీమ్ ను పంపాలని కోరగా.. త్వరలోనే పంపుతామని చెప్పారని పవన్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తాము కోరిన అన్నింటికీ సానుకూల స్పందన రావడంపై పవన్ హర్షం వ్యక్తం చేశారు.






