- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏనుగుల దాడిలో రైతు కిట్టయ్య మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో రైతు కిట్టయ్య ఏనుగు దాడిలో మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో రైతు కిట్టయ్య ఏనుగు దాడిలో మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. పీసీసీఎఫ్ సంబంధిత అధికారులతో గురువారం ఉదయం ఈ ఘటనపై చర్చించారు. రైతు కిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాలలోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేసే ప్రక్రియను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలవారీగానూ, రైతులతోనూ సోషల్ మీడియా గ్రూప్స్ ఏర్పాటు చేసి వాటికి టెక్స్ట్ మెసేజ్‌లతోపాటు, వాయిస్ మెసేజ్‌లు కూడా పంపిస్తే సమాచారం తొందరగా చేరుతుందని సూచించారు.
తమిళనాడు అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఏనుగు మూలంగా తాజా ఘటన చోటు చేసుకొందని, అక్కడ కూడా సదరు ఏనుగు మూలంగా మరణాలు సంభవించాయని అటవీ శాఖ అధికారులు వివరించారు. మన రాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వస్తోందని ట్రాక్ చేసిన వెంటనే సమీప గ్రామాల వారికి ముందుగానే తెలియచేశామన్నారు.






