- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబుకి పురస్కారం.. రాష్ట్రానికి గర్వ కారణం: పవన్ కల్యాణ్
చంద్రబాబుకి పురస్కారం.. రాష్ట్రానికి గర్వ కారణం: పవన్ కల్యాణ్

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎకనమిక్ టైమ్స్ సంస్థ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారాన్ని ప్రకటించడం సంతోషదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వ శైలి ఎంతో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం, నవతరం భవిష్యత్తు కోసం ఆయన అమలు చేస్తున్న పాలన విధానాలు, పారిశ్రామికవృద్ధికి చేపడుతున్న సంస్కరణలు కచ్చితంగా సత్ఫలితాలనిస్తాయని అభిప్రాయపడ్డారు. ఆయనకు దక్కిన ఈ అవార్డు రాష్ట్రమంతటికీ గర్వ కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పురస్కారం ద్వారా రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, అంతకుముందు నారా లోకేష్ కూడా చంద్రబాబు వచ్చిన అవార్డుపై స్పందించారు. చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణం. రాష్ట్రంతో పాటు మా కుటుంబానికి ఇది ఎంతో ప్రతిష్ఠాత్మకం. సంస్కరణలను చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది అని లోకేశ్ పేర్కొన్నారు.






