- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరిలోకి మురుగు నీరు చేరొద్దు: పవన్ కల్యాణ్ ఆదేశం
కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరిట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు...

దిశ, వెబ్ డెస్క్: కాలుష్యరహిత గోదావరి పుష్కరాల(Godavari Pushkarala) నిర్వహణ కోసం ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’(Swacha Godavari – Pavitra Pushkaram) పేరిట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. పుష్కరాల నిర్వహణ నిమిత్తం ఆరు జిల్లాల పరిధిలో గుర్తించిన 262 పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దడంతోపాటు గోదావరి నదిలో కాలుష్య కారక వ్యర్థాల విడుదలను నిలువరించేందుకు నిరంతర పర్యవేక్షణా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.
గ్రామాలు, పట్టణాల్లో...
అంతేకాకుండా గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిర్వహణతోపాటు పారిశ్రామిక కాలుష్య పర్యవేక్షణకు ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. పర్యవేక్షణ బాధ్యతను ప్రధాన నదుల కాలుష్య నివారణకు ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కి అప్పగించనున్నట్టు స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన మురుగు నివారణా చర్యలపై అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం అవసరం అయితే వీబీ జీ రాం జీ, స్వచ్ఛాంధ్ర, కాలుష్య నియంత్రణ మండలి నిధులను కూడా వినియోగించుకోవాలని పవన్ కల్యాణ్ తెలిపారు.






