AP Deputy CM: మాజీ మంత్రి పై భూ ఆక్రమణల ఆరోపణలు.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) గతంలో జరిగిన భూ ఆక్రమణలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

AP Deputy CM: మాజీ మంత్రి పై భూ ఆక్రమణల ఆరోపణలు..  విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) గతంలో జరిగిన భూ ఆక్రమణలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా(Chittoor District)లో వైసీపీ నేత(YCP Leader), మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Former Minister Peddireddy Ramachandra Reddy) అటవీ భూముల ఆక్రమణను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఇప్పటికే అనేక భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. తాను మంత్రిగా ఉన్న సమయంలో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడినట్లు పెద్దిరెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. పెద్దిరెడ్డి భూకబ్జాలపై ప్రజా దర్బార్‌లోనూ అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో అటవీ ప్రాంతంలో గత వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి పెద్ద ఎత్తున ఆక్రమణకు పాల్పడ్డాడని తాజాగా వెలుగు చూసింది.

పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ పరిధిలో అటవీ భూముల ఆక్రమణలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అధికారులు ప్రాథమిక నివేదికను అందించారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పరిధిలో 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. దీంతో పక్కా ఆధారాలతో ఆయన పై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే అటవీ భూములు ఆక్రమించిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయం పై అటవీ శాఖ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో YCP మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణల పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో భూ కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పీసీసీఎఫ్(ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్)ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసం పై విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. రికార్డుల తారుమారులో ఎవరి పాత్ర ఉంది? లబ్ధి పొందినదెవరో? తేల్చాలని దీనిపై చట్టపరంగా ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అటవీ భూములు ఆక్రమణను సహించేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో సత్వరమే ప్రాథమిక నివేదిక అందించాలని పీసీసీఎఫ్‌ను(PCCF) డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు.

Next Story