- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పవన్ కల్యాణ్ మనసు నిజంగా బంగారమే’.. ఈ విషయం తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలోని 42 మంది అనాథ(Orphan Children) పిల్లలకు, జనసేన క్రియాశీలక సభ్యుల ద్వారా రూ.5 వేల చొప్పున జులై నెల జీతాన్ని పంపించారు. అంతేకాదు.. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో పిఠాపురం(Pithapuram) ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా తనకు వచ్చే జీతాన్ని ప్రతి నెలా నియోజకవర్గ పరిధిలో అనాథ పిల్లలకు అందజేయాలని నిర్ణయించారు.
‘తన నియోజకవర్గం పరిధిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఏ విషయంలోనూ ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో.. వారికి నాణ్యమైన ఆహారం, దుస్తులు, చదువు తదితర అవసరాలు తీర్చేందుకు తనకు వచ్చే జీతం మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారులు బాగుండాలన్నదే ఆయన ఆలోచన. దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలిసిన నాయకులు ఉన్న నేటి రాజకీయ వ్యవస్థలో తన కష్టార్జితాన్ని ప్రజల కోసం దానం చేస్తున్న గొప్ప మనసు కలిగిన వ్యక్తి పవన్ కల్యాణ్’ అని జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అయితే.. దీనిని కొందరు జనసైనికులు ఫొటోలో తీసి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. అది కాస్త వైరల్ కావడంతో ‘నిజంగా పవన్ కల్యాణ్ మనసు బంగారం’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.






