- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.. సీఎం పదవిపై మరోసారి కీలక వ్యాఖ్యలు
జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరి కార్యాలయంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కావాలని తాను పార్టీ పెట్టలేదని తెలిపారు. ..

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అధ్యక్షతన మంగళగిరి కార్యాలయంలో జనసేన ఆత్మీయ సమావేశం(JanaSena Aathmiya Samavesam) నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కావాలని తాను పార్టీ పెట్టలేదని తెలిపారు. తెలంగాణలో మొదలైన జనసేన ప్రస్థానం కేరళతో పాటు ఉత్తరప్రదేశ్‌కు సైతం చేరిందన్నారు. తొలుత జనసేనకు 150 మంది సభ్యతం ఉందని, ప్రస్తుతం 21 లక్షలు దాటిందని తెలిపారు. ప్రజాక్షేత్రంలో తాను ఎక్కువగా పర్యటనలు చేయడంతో సైనసైటిస్ తో పాటు పలు ఆరోగ్య సమస్యలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, తన క్షేమం కోరుకున్న వారందరీకి కృతజ్ఞతలు చెబుతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పార్టీ నిర్మాణం పటిష్టంగా చేయలేదని, మున్ముందు కిందస్థాయి వరకూ జనసేన నిర్మాణం చేపడతామన్నారు. 2008 నుంచే జనసేనను ఎలా నడపాలో ప్రణాళికలు రూపొందించానని చెప్పారు. పాతికేళ్లుగా తనలో రగిలిన ఆలోచనే జనసేన పార్టీ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.






