పవన్ కల్యాణ్‌కు వింత పరిస్థితి..తన ఓటు తనకు వేసుకోలేకపోతున్న జనసేన చీఫ్..!

by Jakkula.Mamatha |

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం అయ్యింది. ఎన్నికలకు మరి కొన్ని గంటలే ఉంది.

పవన్ కల్యాణ్‌కు వింత పరిస్థితి..తన ఓటు తనకు   వేసుకోలేకపోతున్న జనసేన చీఫ్..!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం అయ్యింది. ఎన్నికలకు మరి కొన్ని గంటలే ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్ని వ్యూహలు రచిస్తున్నాయి. ఎవరికి వారు గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన ఈ సారి గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు తనకు వేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తుండగా ఓటు హక్కు మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. పొత్తులో భాగంగా మంగళగిరి నుంచి టీడీపీ తరఫున నారా లోకేష్ పోటీ చేస్తుండటంతో పవన్ సైకిల్ గుర్తుకే ఓటు వేసే అవకాశం ఉంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చివరి నిమిషంలో ఖరారు కావడంతో ఓటు ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం లేకుండా పోయిందని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story