పవన్ కల్యాణ్ అత్యంత అందమైన రాజకీయ నాయకుడు: ఆర్జీవీ

by Gantepaka Srikanth |

పవన్ కల్యాణ్ అత్యంత అందమైన రాజకీయ నాయకుడు: ఆర్జీవీ

పవన్ కల్యాణ్ అత్యంత అందమైన రాజకీయ నాయకుడు: ఆర్జీవీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘నా అభిప్రాయం ప్రకారం ఇప్పటివరకు ఉన్న రాజకీయ నాయకుల్లో పవన్ కల్యాణ్ అత్యంత అందమైన రాజకీయ నాయకుడు’’ అని అన్నారు. కాగా, 2014 మార్చి 14న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019కి వచ్చేసరికి సైద్ధాంతిక విభేదాలతో టీడీపీకి దూరం జరిగారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. ఒకే ఒక్క స్థానంలో గెలుపొందారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చెందారు. 2024లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్‌ సీట్లలో పోటీ చేశారు. భారత రాజకీయ చరిత్రలోనే వందకు వందశాతం సక్సెస్ రేట్ సాధించారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కొనసాగుతున్నారు.

Next Story