మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో పవన్ కల్యాణ్‌కు భాగం ఉందా? మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఉన్నట్టుండి పవన్ కల్యాణ్ కు ఆవేశం ఎందుకు వచ్చింది? అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో పవన్ కల్యాణ్‌కు భాగం ఉందా? మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉన్నట్టుండి పవన్ కల్యాణ్ కు ఆవేశం ఎందుకు వచ్చింది? అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ నాయకత్వాన్ని, జగన్ మోహన్ రెడ్డి‌పై ఆయన తీవ్రమైన పదజాలంతో ఎందుకు దూషిస్తున్నట్టు? ఎందుకంటే కూటమి ప్రభుత్వ అసమర్థత బయటపడుతుందని విమర్శించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం చంద్రబాబు స్కామ్ అని భావిస్తూ ప్రజలు కోటి సంతకాలు పెట్టారు.. కోటి సంతకాల ఈ రెఫరెండంను జగన్ మోహన్ రెడ్డి గవర్నర్‌కు అందజేశారని, ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ కల్యాణ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు.

లేదా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో పవన్ కల్యాణ్‌కు కూడా భాగం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. పవన్ ప్రసంగాలు పరిశీలిస్తే విచిత్రంగా ఉందని.. ఓపెనింగ్‌లో ఓవరాక్షన్ చేస్తారు.. ఇంటర్వెల్‌లో ఇరిటేషన్ అవుతారు.. కన్ క్లూజన్‌లో కన్ఫ్యూజ్ అవుతారంటూ అంబటి రాంబాబు సెటైర్లు అంటించారు. పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాదని, వినేవాళ్ళకు అంతకన్నా అర్థం కాదని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో అనేక స్కామ్‌లు జరుగుతున్నాయని, అన్ని స్కాములపై వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక చట్టప్రకారం లోపలేస్తామని ఫైర్ అయ్యారు. అన్ని స్కాముల పై విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.

Next Story