- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోట శ్రీనివాసరావు మృతి పై పవన్ కళ్యాణ్ ఎమోషనల్.. ఆ సినిమాలు గుర్తుచేసుకుంటూ!?
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోట మృతి పై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోట శ్రీనివాసరావు మృతిపై సంతాపం తెలిపారు. ఈ క్రమంలో ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు భాష.. యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది.
ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్ గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా.. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు. 1999-2004 మధ్య శాసన సభ్యుడిగా సేవలందించారు. కోట శ్రీనివాసరావుతో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి నటించిన ‘ప్రాణం ఖరీదు’తోనే కోట చిత్రసీమకు పరిచయం అయ్యారు. నా మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత గోకులంలో సీత, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో కలిసి నటించాము. కోట శ్రీనివాసరావు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కోట శ్రీనివాసరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






