- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పవన్ సెప్టెంబర్ నుండి పూర్తిగా పార్టీపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పవన్ సెప్టెంబర్ నుండి పూర్తిగా పార్టీపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా కూటమిలో కొనసాగుతూనే జనసేన బలోపేతం దిశగా వ్యూహాలు రచించాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితి ఏంటి..? అనే దానిపై సర్వే చేయాలని అనుకుంట్టున్నట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా జనసేనకు బలం ఉన్న 50 నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించగా ఆ స్థానాలలో త్వరలోనే జిల్లాల వారిగా అధ్యక్షులను కూడా నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే విధంగా ఇంటింటికీ జనసేన కార్యక్రామాన్ని నిర్వహించి పార్టీని గ్రౌండ్ లెవల్ నుండి బలోపేతం చేయాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత పవన్ ప్రభుత్వ కార్యక్రమాలతోనే బిజీగా ఉంటున్నారు. అయితే మళ్లీ అధికారంలోకి రావాలంటే పార్టీ కూడా బలంగా ఉండాల్సిందే. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు.






