- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకాశ్ రాజ్ తల్లి మృతికి పవన్ కల్యాణ్ సంతాపం.. ‘ఎక్స్’లో ఎమోషనల్ పోస్ట్
నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత (86) మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత (86) మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ‘శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రకాశ్ రాజ్, ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ల మధ్య గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో రాజకీయ, భావజాల విభేదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల లడ్డూ వివాదం, సనాతన ధర్మం, హిందీ భాషా అంశాలపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అనేకసార్లు పవన్ కల్యాణ్ తీరును ప్రకాశ్ రాజ్ తీవ్రంగా విమర్శించగా, పవన్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఎందుకు అంత నొప్పి అని పవన్ గతంలో ప్రశ్నించారు. అయితే రాజకీయంగా ఎన్ని గొడవలు ఉన్నా వీరిద్దరూ వెండితెరపై మాత్రం వృత్తిపరమైన గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ తల్లి మరణానికి పవన్ సంతాపం తెలపడం ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన కనీస సంస్కారానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






