- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్తిపాడు ఘటనపై పవన్ సీరియస్.. జనసేన ఇంచార్జ్ సస్పెండ్
ప్రత్తిపాడు సీహెచ్‌సీ ఘటన (Prathipadu CHC Issue)పై జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సీరియస్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రత్తిపాడు సీహెచ్‌సీ ఘటన (Prathipadu CHC Issue)పై జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సీరియస్ అయ్యారు. ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు (Janasena In Charge Varupula Thammaiah Babu)ను పార్టీ నుంచి సస్పెండ్ (Suspend) చేశారు. మహిళా దినోత్సవం రోజున ప్రత్తిపాడు జనసేన నాయకుడు తమ్మయ్య బాబు ప్రతిపాడు సీహెచ్‌సీకి వెళ్లి హల్ చల్ చేశాడు. డ్యూటీ ఉన్న డాక్టర్ ని మహిళ అని చూడకుండా దుర్భాషలాడుడూ.. బీభత్సం సృష్టించాడు. ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలని డాక్టర్ తో పాటు పలువురు సిబ్బందిని సైతం తమ్మయ్య బాబు హెచ్చరించారు.
దీనికి సంబంధించిన వీడియో కాస్త నెట్టింట చక్కర్లు కొట్టడంతో జనసేన నేత తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళా డాక్టర్ పై నోరు పారేసుకోవడం పట్ల జనసేన నాయకుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. దీనిపై జనసేన అధిష్టానం స్పందిస్తూ.. వరుపుల తమ్మయ్య బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన మహిళా డాక్టర్ పట్ల ఆయన ప్రవర్తించిన వ్యవహార శైలి పై అసహనం వ్యక్తం చేసింది. తమ్మయ్య బాబుపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకి సూచించారు. అంతేగాక ప్రత్తిపాడు పీహెచ్‌సీ వైద్యురాలు డా. శ్వేత పట్ల జనసేన ఇన్చార్జి తీరుపై విచారించి తక్షణమే నివేదిక ఇవ్వాలని కాకినాడ జిల్లా అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేశారు.
పవన్ ఆదేశాల ప్రకారం ఘటనపై, తమ్మయ్య బాబు తీరుపై జనసేన నాయకులు అధిష్టానానికి నివేదిక అందజేశారు. దీంతో ప్రత్తిపాడు నియోజక వర్గం పార్టీ ఇంచార్జీ పరువుల తమ్మయ్య బాబును అగ్ర నాయకత్వం నిర్ణయం మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని జనసేన పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రత్తిపాడు సీహెచ్‌సీ ఘటనపై అందిన నివేదికలను, వివరణలను పరిగణలోకి తీసుకోవడం జరిగిందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక విధి నిర్వహణలో ఉన్న ప్రత్తిపాడు సీహెచ్‌సీ వైద్యురాలు డా. శ్వేత పట్ల అనుచితరంగా ప్రవర్తించి, దుర్భాషలాడిన ఘటన దురదృష్టకరమని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.






