TDP Mahanadu : పవన్ నాకు అన్నలాంటి వాడు : నారా లోకేష్

by Muthe.Rajitha |

టీడీపీ మహానాడు(TDP Mahanadu) చివరి రోజున మంత్రి నారా లోకేష్(Nara Lokesh) భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.

TDP Mahanadu : పవన్ నాకు అన్నలాంటి వాడు : నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ మహానాడు(TDP Mahanadu) చివరి రోజున మంత్రి నారా లోకేష్(Nara Lokesh) భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. 'మహానాడు అదిరిపోయింది.. పౌరషాల గడ్డపై కొత్త జెండా రెపరెపలాడుతుంది. ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్నాం.. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటుదెబ్బ..' అని మంత్రి నారా లోకేశ్​పేర్కొన్నారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి సభలో ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ నాకు అన్నతో సమానమని తెలియ జేశారు. ఆయన జెండాలు, అజెండాలు పక్కనపెట్టి మనకోసం పని చేశారని కొనియాడారు.

పార్టీలో సీనియర్లను, జూనియర్లను అందరినీ గౌరవిస్తానని, పని చేసేవారిని ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు. 'జెండా పీకేస్తామన్నారు.. ఇప్పుడు వారు పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకుని వెళ్లిపోతున్నారు. వైనాట్​175 అన్నారు.. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి.. ఏ తప్పు చేయని మన ప్రజానాయకుడిని బంధించారు. అప్పుడు వారి నాయకుడిని ఏకంగా తాడేపల్లి ప్యాలెస్​లో ఉంచి తాళాలు వేసి బంధించారు. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవరు.. ట్రెండ్​సెట్​చేస్తారు.. సీబీఎన్​అంటే ప్రజలందరి ధైర్యం' అని అన్నారు.

Next Story