- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan : ఏపీ రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్ గా పవన్ !
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ (Hot Topic)మారారు.

దిశ, వెబ్ డెస్క్ : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ (Hot Topic)మారారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu)ను పరామర్శించేందుకు వెళ్లి అనూహ్యంగా టీడీపీతో అక్కడే పొత్తును ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ పాత్ర పోషించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకంగా మారిన పవన్ కల్యాణ్ తరుచు తన విలక్షణ నిర్ణయాలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు.
జనసేన ఆవిర్భావ తొలినాళ్లలో చెగువేరా ఆదర్శమని..కాలక్రమేణా అందుకు పూర్తి విరుద్ధంగా సనాతన ధర్మ పరిరక్షణ నినాదం ఎత్తుకుని పవన్ కల్యాణ్ తీసుకున్న సైద్ధాంతిక యూటర్న్ అందరిని ఆశ్చర్యపరిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వంటి పరిపాలన దక్షుడు ఏపీ సీఎంగా ఉండటం మంచి పరిణామంటూ స్పష్టీకరించిన పవన్ కల్యాణ్ తాజాగా సీఎం చంద్రబాబు నిర్వహించిన రెండు అధికారిక సమావేశాలకు అనారోగ్యం..తీవ్రమైన నడుం నొప్పి కారణాలతో డుమ్మా కొట్టారు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరి మరోసారి తన అనూహ్య నిర్ణయాలతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఈ 6వ తేదీన కేబినెట్ సమావేశానికి, ఆ తర్వాత జరిగిన మంత్రులు, సెక్రటరీలతో నిర్వహించిన కీలక సమావేశాలకు అనారోగ్య కారణాలతో డుమ్మా కొట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించకుండానే తీర్థయాత్రలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.






