Pavan Kalyan: సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan) అన్నారు.

Pavan Kalyan: సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan) అన్నారు. మృతుల కుంటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఆ విషయంలో ఎవరూ ఆందోళన చెందకూడదని.. క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలిలో హోంమంత్రి అనిత (Home Minister Anita) సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందిస్తూ.. సింహాచలం ఘటన తనను కలచివేసిందని అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఇప్పటికే కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని అన్నారు. క్షతగాత్రులకు కూడా మెరుగైన చికిత్స అందజేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story