- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pavan: వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు జనసేన మద్దతు.. పార్టీ ఎంపీలకు పవన్ కీలక ఆదేశాలు
కాసేపట్లో లోక్‌సభ (Lok Sabha) ముందుకు ఇవాళ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు (Waqf Act Amendment Bill) రాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: కాసేపట్లో లోక్‌సభ (Lok Sabha) ముందుకు ఇవాళ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు (Waqf Act Amendment Bill) రాబోతోంది. దాదాపు బిల్లుపై ఏకంగా 8 గంటలకు పాటు చర్చ జరపాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. అయితే, పరిస్థితిని బట్టి చర్చ సమయాన్ని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Union Minister Kiren Rijiju) బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్డీఏ (NDA) భాగస్వామి అయిన జనసేన (Janasena) అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు తమ మద్దతును తెలిపారు. చట్ట సవరణతో ముస్లిం సమాజానికి మేలు జరగుతుందని తాము నమ్మకం ఉందని అన్నారు.
వక్ఫ్ చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పర్యవేక్షించిందని తెలిపారు. సంబంధిత వర్గాలు, విద్యావంతులు, పాలనారంగ నిపుణులతో చర్చించి బిల్లును రూపొందించారని పేర్కొన్నారు. బ్రిటిష్ (British) కాలం నాటి వక్ఫ్ చట్టాన్ని కాలానుగుణంగా క్రమబద్ధీకరించడం ద్వారా విస్తృత ఫలితాలు దక్కుతాయని.. అందుకే తాము వక్ఫ్ చట్ట సవరణకు మద్దతివ్వాలని నిర్ణయించాబని అన్నారు. అదేవిధంగా పార్టీలు ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (Uday Srinivas), వల్లభనేని బాలశౌరి (Balashowri)లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బిల్లుకు అనుకూలంగా గైర్హాజరు అవ్వకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని వారిని ఆదేశించారు. మరోవైపు టీడీపీ (TDP) అధిష్టానం ఎంపీలంతా ఇవాళ లోక్‌సభకు తప్పక హాజరుకావాలని విప్ జారీ చేసింది.






