- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దస్థాయిలో ఉన్న వ్యక్తిని కాబట్టి పోలీసులు నన్ను కొట్టలేదు.. అభినయ్ దర్శన్
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ జైల్ నుండి పాస్టర్ అభినవ్ దర్శన్ విడుదలయ్యారు. 8 రోజులు నర్సీపట్నం సబ్ జైల్లో ఉండగా.. ఆయనకు నర్సీపట్నం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా తాజాగా అభినయ్ దర్శన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ జైల్ నుండి పాస్టర్ అభినవ్ దర్శన్ విడుదలయ్యారు. 8 రోజులు నర్సీపట్నం సబ్ జైల్లో ఉండగా.. ఆయనకు నర్సీపట్నం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా తాజాగా అభినయ్ దర్శన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ పాదయాత్ర చేస్తానా? లేదా? అనే డౌట్ చాలామందిలో ఉందని.. ఎలాంటి విరామం లేకుండా పాడేరు నియోజకవర్గం నుండి పాదయాత్రను కొనసాగిస్తానని తెలిపారు. దేవుడి కృప వల్ల లాయర్ గోవిందరాజు తనకోసం ఎంతో ఫైట్ చేసి బయటకు తీసుకువచ్చారని చెప్పారు. చాలా మంది అభియన్ దర్శన్ ను బయటకు తీసుకువస్తుంది హైకోర్టు లాయర్ అంటూ ప్రచారం చేశారని కానీ కాదని అన్నారు.
తనపై దాడి జరిగి తొమ్మిది రోజులు అవుతోందని ఎనిమిది రోజులు తాను జైలులో ఉన్నానని చెప్పారు. జైలులో ఖైదీలు తనపై దాడి చేశారన్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదన్నారు. అనను అరెస్ట్ చేసిన పోలీసులు కూడా తనను కొట్టలేదని చాలా గౌరవంగా చూసుకున్నారని అన్నారు. పెద్దస్థాయిలో ఉన్న వ్యక్తి, జనాదరణ ఉన్న వ్యక్తి కాబట్టి మంచి హాస్పిటాలిటీ కల్పించారని చెప్పాడు. తాను సింహం లాంటి వ్యక్తినని గాయపడిన సింహం వెనకడుగు వేయదని అన్నాడు. కసిగా వేటాడతానని మళ్లీ పాడేరు నియోజకవర్గం నుండి పాదయాత్ర చేస్తానని ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతానని చెప్పాడు.






