- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐ యూనివర్సిటీ ఏర్పాటులో భాగస్వామికండి : ముఖ్యమంత్రి చంద్రబాబు
డేటా సెంటర్.. ఏఐ.. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముందుకెళ్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : డేటా సెంటర్.. ఏఐ.. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముందుకెళ్తోంది. అబుదాబి (Abudabi) తరహాలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు మీరు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandra Babu Naidu) ఎల్జీ కెమ్ చీఫ్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ ఆఫీసర్ యున్జోకోను కోరారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) రెండో రోజులో భాగంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఎల్జీ కెమ్ (LG Chem) చీఫ్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ ఆఫీసర్ యున్జోకోతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాకినాడ లేదంటే మూలపేటల్లో ఎల్జీ కెమ్ నాఫ్తా క్రాకర్ కాంప్లెక్స్, పాలిమర్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకు రావాలని ప్రతిపాదించారు. ఎల్జీ కెమ్ ఏర్పాటు చేయదలచిన కాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీ యూనిట్ కు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఏపీ సర్క్యులర్ ఎకానమీ పాలసీలో భాగంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు వీలుందని సీఎం సూచించారు. టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటులో భాగస్వాములు కావాలని కోరారు.
ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ..
ప్రముఖ గ్లోబల్ హాస్పిటాలిటీ గ్రూప్ అట్మాస్పియర్ కోర్ దక్షిణాసియా ఎండీ సౌవగ్య మొహాపాత్ర, గ్రూప్ ఎండీ సలీల్ పాణిగ్రాహితోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆధునిక పర్యాటక రంగ అభివృద్ధి, ప్రీమియం లగ్జరీ హోటల్ పోర్ట్‌ఫోలియో విస్తరణ అంశాలపై చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో అట్మాస్పియర్ కోర్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇఫ్కో చైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో సమావేశమై గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై చర్చించారు. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం పర్యాటక రంగంలో ప్రముఖ సంస్థ కోర్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ తీర పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఇందుకు కోర్డెలియా క్రూయిజెస్ కలిసి రావాలని ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఈవో జుర్గెన్ బైలామ్‌ను సీఎం కోరారు.






