- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్ బీసీలను వెన్నుపోటు పొడిచారని పరిటాల సునీత ఫైర్
by Malleboina Mahesh |
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

X
దిశ, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ నేత పరిటాల సునీత సీఎం జగన్ పై మండిపడ్డారు. బీసీలే వైసీపీ పార్టికి వెన్నెముక అని చెప్పుకునే జగన్ బీసీలకు వెన్నుపోటు పొడిచిందని ఆమె ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అక్రమాలు ఎదిరించినందుకు 2,540 మంది బీసీలపై వైసీపీ నేతలు దాడులు చేశారని, దాదాపు 75 మందిని కిరాతకంగా హత్య చేశారని ఆమె ఆరోపించారు. అలాగే.. బీసీల ఆత్మగౌరవం నుంచి టీడీపీ పుట్టిందని, నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు నాయుడు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని మాజీ మంత్రి పరిటాల సునీత మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.
Next Story






