ఒకసారి తల్లిదండ్రులు రక్షించారు.. ఈసారి మాత్రం..!

by Vemula.Srinu Prasad |

ఆత్మహత్యకు ప్రయత్నించిన కన్నకూతురిని ఓసారి తల్లిదండ్రులు రక్షించారు...

ఒకసారి తల్లిదండ్రులు రక్షించారు.. ఈసారి మాత్రం..!
X

దిశ, వెబ్ డెస్క్: ఆత్మహత్యకు ప్రయత్నించిన కన్నకూతురిని ఓసారి తల్లిదండ్రులు రక్షించారు. ఈసారి మాత్రం కాపాడుకోలేకపోయారు. నివాసముంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. గన్నవారిపల్లె కాలనీకి చెందిన లక్ష్మీప్రసన్నకు, కర్ణాటకలోని కోలార్ జిల్లా వాసి విజయ్ కుమార్‌కు గత నెలలోనే పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ప్రశాంతంగా జీవించారు. మరికొన్ని రోజుల్లో ఉత్తవారి ఇంటికి వెళ్లాల్సింది. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన జరిగింది. గన్నవారిపల్లె కాలనీలోని నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని లక్ష్మీప్రసన్న బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులకు తండ్రి సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే గతంలోనూ లక్ష్మీప్రసన్న ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఆ సమయంలో ఆమెను తల్లిదండ్రులు రక్షించారని చెప్పారు. తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా లక్ష్మీప్రసన్న పని చేస్తున్నారని, అత్తగారింటికి వెళ్లడం ఇష్టంలేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.

Next Story