వల్లభనేని వంశీకి హిమోగ్లోబిన్ డౌన్.. పంకజశ్రీ కామెంట్స్ !

by velandi.Saikiran |

వల్లభనేని వంశీ ఆరోగ్యం పై ( Vallabhaneni Vamsi's health) ఆయన సతీమణి పంకజశ్రీ ( Pankajashri ) షాకింగ్ కామెంట్స్ చేశారు. వ

వల్లభనేని వంశీకి హిమోగ్లోబిన్ డౌన్.. పంకజశ్రీ కామెంట్స్ !
X

దిశ, వెబ్ డెస్క్: వల్లభనేని వంశీ ఆరోగ్యం పై ( Vallabhaneni Vamsi's health) ఆయన సతీమణి పంకజశ్రీ ( Pankajashri ) షాకింగ్ కామెంట్స్ చేశారు. వల్లభనేని వంశీ ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ ప్రస్తుతం మెడికేషన్ లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. హిమోగ్లోబిన్ ( Hemoglobin ) పూర్తిగా తగ్గిపోయిందని... వల్లభనేని వంశీ ( Vallabhaneni Vamsi ) మెడిసిన్ తీసుకుంటున్నట్లు.. వివరించారు.

అలాగే ఆయనకు శ్వాస సంబంధిత సమస్య ఎక్కువ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ కోసం మరోసారి పిటిషన్ వేయమని జడ్జి పేర్కొన్నట్లు వివరించారు వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ. దీంతో పంకజ శ్రీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా వల్లభనేని వంశీ రిమాండ్ ( Remand) పొడిగించింది ఎస్సీ అలాగే ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు.

సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ( Satya Vardhan kidnapping case ) ఈ నెల 13వ తేదీ వరకు వల్లభనేని వంశీ రిమాండ్ ను పొడిగించింది కోర్టు. వంశీ తో పాటు మరో మిగతా ఐదుగురు నిందితులకు కూడా రిమాండ్...పొడగిస్తూ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో మరికొన్ని రోజులు వల్లభనేని వంశీ జైలు జీవితాన్ని గడపనున్నారు.

Next Story