పల్నాడు : మాచవరంలో చిన్నారులపై పిచ్చికుక్క దాడి

by Thanuru Gopichand |

కుక్కల బెడద తప్పించాలని అధికారులను కోరుతున్న ప్రజలు.

పల్నాడు : మాచవరంలో చిన్నారులపై పిచ్చికుక్క దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లాలోని (Palnadu District) మాచవరంలో (Machavaram) పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఇద్దరు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. పిచ్చికుక్క (Mad Dog) చిన్నారులపై దాడి (Attack On Kids) చేయడంతో ఆందోళనకర వాతావరణం నెలకొంది. నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం మాచవరంలో స్థానికంగా ఉండే చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ పిచ్చికుక్క వారి వైపు ఉరుక్కుంటూ వచ్చింది. చిన్నారులపై దాడికి తెగబడింది. ఒక చిన్నారి దవడ భాగానికి తీవ్ర గాయం కాగా, మరో చిన్నారికి వీపుపై గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుక్కను బెదరగొట్టి తరిమేశారు. చిన్నారులను హుటాహుటిన హాస్పిటలుకు తరలించారు. ప్రస్తుతం చిన్నారులు చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల కుక్కల బెడద పెరిగిపోయిందని.. వాటి దాడులను అరికట్టడంపై అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు కూడా కుక్కల స్వైర విహారంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కుక్కల నుంచి చిన్నారులతో పాటు పెద్దలకు రక్షణ కల్పించాలని మాచవరంవాసులు కోరుతున్నారు.

Next Story