- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan : అన్ని ఉగ్రదాడుల వెనుక పాక్ హస్తం : పవన్ కళ్యాణ్
ఏపీ(AP)లోని విజయవాడ(Vijayawada)లో నేడు భారతీయ జనతా పార్టీ(BJP), తెలుగుదేశం పార్టీ(TDP), జనసేన పార్టీ(JSP) ఆధ్వర్యంలో నిర్వహించిన భారత శౌర్య తిరంగా యాత్ర(Tiranga Yatra)లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని విజయవాడ(Vijayawada)లో నేడు భారతీయ జనతా పార్టీ(BJP), తెలుగుదేశం పార్టీ(TDP), జనసేన పార్టీ(JSP) ఆధ్వర్యంలో నిర్వహించిన భారత శౌర్య తిరంగా యాత్ర(Tiranga Yatra)లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ యాత్ర ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)తో సహా భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక పాకిస్థాన్(Pakistan) హస్తం ఉందని ఆరోపించారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు శిక్షణ, ఆయుధాలు, ఆశ్రయం కల్పిస్తోందని ఆయన తీవ్రంగా ఖండించారు. తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రదాడిలో పట్టుబడిన కసబ్ ఎంతోమందిని అమాయకులను చంపేశాడని.. ఇలాంటి దారుణాల వెనుక ఉన్న పాక్ ను ఎప్పటికీ క్షమించే ప్రసక్తే లేదన్నారు.
తమ దేశాన్ని ఎలుకునే శక్తి లేక, మన దేశపు అభివృద్ధిని చూసి ఓర్వలేక, మనల్ని వెనక్కి నెట్టాలని ఈ దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశ విభజన జరిగిన నాటి నుంచి మనం ప్రశాంతంగా లేమని పేర్కొన్నారు. సుమారు 5000 మందితో సాగిన ఈ యాత్రలో జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాలు చేస్తూ, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, PoKని ఖాళీ చేయాలని పవన్ డిమాండ్ చేశారు. జాతీయ భద్రత కోసం జనసేన శ్రేణులు సర్వమత ప్రార్థనలు, సైనికులకు ఆధ్యాత్మిక మద్దతు అందించాలని పిలుపునిచ్చారు.






